Tollywood : తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం

ప్రొడ్యూసర్‌లు సి.కళ్యాణ్‌, దిల్‌రాజు ప్యానల్‌ ల మధ్య పోలింగ్ జరుగగా..దిల్ రాజు ప్యానల్‌ వారు విజయం సాధించారు

Published By: HashtagU Telugu Desk
Dil raju panel wins

Dil raju panel wins

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు (Telugu Film Chamber Elections) ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. ప్రొడ్యూసర్‌లు సి.కళ్యాణ్‌ (C Kalyan), దిల్‌రాజు (Dil Raju) ప్యానల్‌ ల మధ్య పోలింగ్ జరుగగా..దిల్ రాజు ప్యానల్‌ వారు విజయం సాధించారు. స్రవంతి రవికిషోర్‌, రవిశంకర్‌ యలమంచలి, దిల్‌ రాజు, దామోదర ప్రసాద్‌, మోహన్‌ వడ్లాపాటి, పద్మిని గెలుపొందారు. ఫిలిం చాంబర్‌ (Film Chamber)లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1600 ఓట్లకు 891 ఓట్లు పోల్‌ కాగా.. స్టూడీయో సెక్టార్‌లో 98 ఓట్లకు 68 పోల్‌ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి.

ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, బెనర్జీ, అశోక కుమార్‌, నటి జీవితా రాజశేఖర్ సహా పలువురు నటీనటులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ముందు నుండి కూడా దిల్ రాజు ప్యానల్‌ విజయం సాదిస్తుందని అంత ధీమా వ్యక్తం చేసారు. అనుకున్నట్లే దిల్ రాజు ప్యానల్‌ వారు విజయం సాధించారు. ఇక చిత్రసీమలో ఏ ఎన్నికలు జరిగిన రాజకీయ పార్టీల ఎన్నికల మాదిరే ఫైట్ ఉంటుంది. ఒకరి ఫై ఒకరు విమర్శలు చేసుకోవడం చేస్తుంటారు. ఆ మధ్య మా (Maa Elections) ఎన్నికలు ఏ రేంజ్ లో జరిగాయో తెలియంది కాదు. ఇక ఈరోజు జరిగిన ఎన్నికలు కూడా అలాగే హోరాహోరీగా జరిగాయి.

Read Also : Hollywood Movies : హాలీవుడ్ సినిమాలు ఇండియాలో 100 కోట్లు.. ఓపెన్‌ హైమర్‌, మిషన్ ఇంపాజిబుల్ 7 హవా..

  Last Updated: 30 Jul 2023, 07:21 PM IST