Site icon HashtagU Telugu

Ashish Reddy : కొత్త దర్శకుడి చేతిలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో..?

Dil Raju Family Hero Ashish Reddy Movie With Debut Director Hari

Dil Raju Family Hero Ashish Reddy Movie With Debut Director Hari

Ashish Reddy దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఆశిష్ ఫస్ట్ సినిమా రౌడీ బోయ్స్ ఎలాగోలా నెట్టుకురాగా ఫ్యామిలీ హీరోని ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలనే ఆలోచనతో వరుస క్రేజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆశిష్ రెడ్డి రెండో సినిమా సెల్ఫిష్ సెట్స్ మీద ఉంది. ఆ సినిమా వస్తుందా రాదా అన్నది తెలియదు కానీ థర్డ్ అటెంప్ట్ గా చేసిన లవ్ మీ సినిమా మాత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.

లవ్ మీ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించడం సినిమాపై ఆడియన్స్ లో బజ్ పెంచింది. ఇక ఆశిష్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాను మరో కొత్త దర్శకుడితో చేస్తున్నాడని టాక్. దిల్ రాజు దగ్గర అసోసియేట్ గా చేస్తున్న హరి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా రాబోతుందని టాక్. హరి శతమానం భవతి 2 కి కూడా కథ అందించాడు.

హరి డైరెక్షన్ లో ఆశిష్ రెడ్డి హీరోగా డిఫరెంట్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆశిష్ రెడ్డి లవ్ మీ కూడా వెరైటీ కాన్సెప్ట్ తో వస్తుండగా హరి డైరెక్షన్ లో నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆశిష్ రెడ్డి హీరోగా అదరగొట్టాలని చూస్తున్నాడు. వెనకాల దిల్ రాజు బ్యానర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆశిష్ కెరీర్ కి ఏమత్రం డోకా ఉండదని చెప్పొచ్చు.

Also Read : Water Maidens : హైదరాబాద్‌లో సాగర కన్యల సందడి