Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్ళుగా నిర్మాణంలోనే ఉన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్స్ పూర్తి చేసిన శంకర్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పై ఫోకస్ పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుతూ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అభిమానులు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే, జూన్ నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు బడా సినిమాలు అన్ని డేట్స్ ని లాక్ చేసుకొని ఉన్నాయి. ప్రస్తుతం ఏదైనా కొంచెం ఖాళీ ఉందంటే.. అది అక్టోబర్ మాత్రమే. గతంలో ఈ సినిమాని అక్టోబర్ లోనే తీసుకు రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్ చేయలేదు. అయితే రీసెంట్ గా అక్టోబర్ పై మరికొన్ని సినిమాలు కన్ను వేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ త్వరగా అక్టోబర్ ని లాక్ చేసుకోకుంటే.. కష్టం అవుతుందని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
కానీ శంకర్ మాత్రం గేమ్ ఛేంజర్ కాదు కదా,, ఇండియన్ 2 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడం లేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ శంకర్ అండ్ దిల్ రాజుని ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. ఇక ఈ విషయం గురించి దిల్ రాజు కుమార్తెని ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “గేమ్ ఛేంజర్ ఒక డిఫరెంట్ స్టోరీ. అది అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికి కూడా సందేహం గానే.. అక్టోబర్ లో వస్తుందని అనుకుంటా అనే మాటలు వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఇంకా నిరుత్సాహపడుతున్నారు.
#GameChanger is a very different story, hopefully we are coming by October.
–#DilRaju‘s daughter #HanshithaReddy at Tirumala today.#RamCharan pic.twitter.com/Lqa9EhsYSt
— Gulte (@GulteOfficial) May 28, 2024