తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్(Biopic)ల హవా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులపై ఎన్నో బయోపిక్లు తెరకెక్కాయి. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ నిర్మాతపై బయోపిక్ రూపొందబోతుందనే సమాచారం సినీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. అలాంటి చర్చకు కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు. తన సినీ ప్రస్థానంపై ఎవరో బయోపిక్ తీస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. 1994లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, డిస్ట్రిబ్యూటర్‌గా, తర్వాత నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు.. తన ప్రయాణం ఓ పెద్ద కథేనని చెబుతున్నారు.
CM Chandrababu : సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: సీఎం చంద్రబాబు
తాజాగా దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో వస్తున్న తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నితిన్తో (Nithin) ఆయన స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు. అందులో బయోపిక్‌పై నితిన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “బయోపిక్ తీస్తే నువ్వే హీరో. ఇంకెవరు?” అంటూ నవ్వుతూ స్పష్టత ఇచ్చారు. నితిన్‌ను తాను తమ్ముడిలా భావిస్తానని, తన పాత్రకు అతడే పర్ఫెక్ట్ అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, తన బయోపిక్‌కి నిర్మాతగా తానే వ్యవహరిస్తానని ప్రకటించారు. ఈ మేరకు భవిష్యత్తులో వచ్చే ఒక వినూత్న బయోపిక్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి.
దిల్ రాజు సినీ ప్రస్థానం చాలా ఇంట్రస్టింగ్‌ది. 1997లో పెళ్లిపందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టి, 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారి, అదే సినిమా పేరు మీద తన పేరు ‘దిల్ రాజు’గా మారింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా పదుల సంఖ్యలో హిట్ చిత్రాలు నిర్మించారు. కేవలం నిర్మాతగానే కాకుండా, కొత్త టాలెంట్‌కు వేదికగా దిల్ రాజు డ్రీమ్స్ అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు. అలాగే తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక నిర్మాత జీవిత కథను తెరపై చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.