Dil Raju : నిజామాబాద్ వేదికగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సంస్కృతిలో దావత్ గురించి అవమాన కరంగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
నిజంగా నా వ్యాఖ్యలతో మీరు బాధ పడి ఉంటే నన్ను క్షమించండి అంటూ నిర్మాత దిల్ రాజు వేడుకున్నారు. మన తెలంగాణ సంప్రదాయాలను నేను గౌరవిస్తానని తెలిపారు. నేను తీసిన ఫిదా, బలగం లాంటి చిత్రాలను తెలంగాణ ప్రజలు ఎంతో ఆదరించారని పేర్కొన్నారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి కోరారు. కాగా… సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో తెలంగాణ వాళ్లు కళ్లు, మటన్, చికెన్ తింటారని దిల్ రాజ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మనకి వైబ్ కావాలంటో మటన్, కల్లు ఉండాలి అని అక్కడ సంస్కృతిపై సరదాగా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ వాదుల్ని కించ పరిచినట్లుగా అనిపించడంతో రాజుగారు క్షమాపణలతో ముందుకొచ్చారు. దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లే అదే నిర్మాత నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also: PM Modi Youtube Channel : ప్రధాని మోడీ యూట్యూబ్ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!