Site icon HashtagU Telugu

Pushpa 2 : సుకుమార్, బన్నీ మధ్య విబేధాలు..? డిసెంబర్‌లో కూడా పుష్ప 2 కష్టం..!

Allu Arjun, Pushpa 2, Sukumar

Allu Arjun, Pushpa 2, Sukumar

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ కెరీర్ ని ఒకే సమయంలో స్టార్ట్ చేసిన వీరిద్దరూ.. మెల్లిమెల్లిగా ఎదుగుతూ వచ్చారు. ఆర్య, ఆర్య 2, పుష్ప సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో అయితే, ఏకంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక పుష్పతో నేషనల్ ఆవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ‘సుకుమార్ లేకపోతే తాను లేను’ అంటూ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు అదే సినిమా సుకుమార్ అండ్ బన్నీ మధ్య విబేధాలు తీసుకు వచ్చిందని చెబుతున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సరిగ్గా నిర్వహించకపోవడంతో సుకుమార్ పై అల్లు అర్జున్ కోపం తెచ్చుకున్నారని, దీంతో కుటుంబంతో కలిసి బన్నీ వెకేషన్ కి వెళ్లిపోయారని చెబుతున్నారు. అంతేకాదు, అల్లు అర్జున్ తన గడ్డంని కూడా ట్రిమ్ చేసేసారు. ఇక అల్లు అర్జున్ ఇలా చేయడంతో సుకుమార్ కూడా వెకేషన్ కి చెక్కేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్ మీద బ్రేక్ పడినట్లు సమాచారం.

ఇలా బ్రేక్ లు పడితే ఈ సినిమా డిసెంబర్ కి రావడం కూడా కష్టమే అన్నట్లు కనిపిస్తుంది. దాదాపు మూడేళ్ళ నుంచి ఈ సినిమాని చిత్రీకరిస్తూనే ఉన్నారు. విజువల్స్ ఎఫెక్ట్స్, వార్ సన్నివేశాలు ఉన్న బాహుబలిని కూడా రాజమౌళి ఇన్నాళ్లు చిత్రీకరించలేదు. అలాంటిది కేవలం ఒక కమర్షియల్ సినిమాకి ఇంతటి సమయం ఎందుకు పడుతుందో అర్ధం కావడం లేదు. దీనికి కారణం ఇలాంటి బ్రేక్‌లేనా..? ఈ బ్రేక్‌లు వల్ల నిర్మాత కూడా నష్టపోయే అవకాశం ఉంది. మరి హీరో, దర్శకుడు ఈ విషయాన్ని అలోచించి సినిమాని త్వరగా పూర్తి చేస్తారా లేదా చూడాలి.