నిన్నటి నుండి సోషల్ మీడియా (Social Media) తో పాటు మీడియా చానెల్స్ లలో కొండా సురేఖ (Konda Surekha) చేసిన కామెంట్స్ గురించే చర్చ నడుస్తుంది. బాధ్యత మైన హోదా లో ఉండికూడా ఓ సాటి మహిళా ఫై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తారా అంటూ కొండా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినీ లోకమే కాదు యావత్ సినీ అభిమానులు, రాజకీయతర నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చిరంజీవి (CHiranjeevi) దగ్గరి నుండి ప్రతిఒక్కరు సురేఖ కామెంట్స్ ఫై నిప్పులు చెరుగుతూ ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరిస్తున్నారు. చిత్రసీమ అంటే అందరికి చిన్న చూపుగా మారిందని..ఇండస్ట్రీలో అంత ఒకోటిగా వుండకపోవడమే దీనికి కారణం అవుతుందని.మా వరకు రాలే కదా మాకెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు చిత్రసీమలో వ్యక్తులపై ఆస్తులపై దాడులు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.
ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం (YCP) సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈ ఇండస్ట్రీ వ్యక్తులంతా ఏమైపోయారని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అన్నారో..ఎన్ని బూతులు తిట్టారో..ఇంట్లో ఉండే భార్య పిల్లలను సైతం వదలకుండా అనరాని మాటలు అన్నప్పుడు చిత్రసీమలో వ్యక్తులు ఎవ్వరైనా ఇది తప్పు అని అన్నారా..? ఏ ఒక్కరు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిచారా..? ఇది తప్పు అని గత వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసారా..? లేదే..అప్పుడు నోరు లేని వారికీ ఇప్పుడు నోరు ఎందుకు లేస్తుంది..? అంటే పవన్ కళ్యాణ్ ఒకటి..నాగార్జున ఒకటా..? నాగార్జున కు మాత్రమే ఫ్యామిలీనా..? పవన్ కళ్యాణ్ ది ఫ్యామిలీ కదా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో పవన్ కు సంబంధం లేని విషయంలో శ్రీరెడ్డి (Srireddy) అనే మహిళ అతని తల్లిని అవమానించినా, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పోసాని (Posani ) లాంటి వారు పవన్ కూతుర్ల విషయంలో సమాజం సిగ్గుపడేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసినా ఇండస్ట్రీ తరుపున ఆ వ్యాఖ్యలను ఖండించి పవన్ కు మద్దతుగా రెండు మాటలు మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఆసక్తి చూపలేదు. అలాగే పవన్ ను టార్గెట్ చేయడానికి ఆయన వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వైసీపీ నేతలు ప్రవర్తించినా ఇది తప్పు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సినీ పరిశ్రమ నుండి ఒక్కరుకూడా సాహసించలేదు. ఇదేనా తోటి నటుడి పట్ల వారి కుటుంబాల పట్ల ‘మా’ ఇచ్చే గౌరవం..? అంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి చిత్రసీమలో ఓ వ్యక్తికి ఆపద వస్తే..అందరు కలిసి రావాలని కోరుకుంటున్నారు.
Read Also : Konda Surekha Comments : ఇకపై ఎక్కడ తగ్గొద్దంటున్న నిర్మాత బన్నీ వాసు..