Prabhas : క్రికెట్‌లో ప్రభాస్‌ని ఓడించిన రాజమౌళి.. ఆ గేమ్ చూశారా..?

ఛత్రపతి సినిమా సమయంలో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్ ని ప్లాన్ చేశారు. ఛత్రపతి మూవీ యూనిట్ అంతా కలిసి రెండు టీంలుగా విడిపోయి క్రికెట్(Cricket) ఆడి ఆడియన్స్ ని అలరించారు.

Published By: HashtagU Telugu Desk
Did You Watch Rajamouli Prabhas Cricket Game Video while Chatrapathi Movie Promotions

Did You Watch Rajamouli Prabhas Cricket Game Video while Chatrapathi Movie Promotions

ప్రభాస్(Prabhas), రాజమౌళి(Rajamouli) కలిసి ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేశారు. ఛత్రపతి చిత్రంతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ని నమోదు చేసిన ఈ కాంబినేషన్.. ఆ తరువాత ‘బాహుబలి’తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. కాగా మన జక్కన్న తన సినిమా తెరకెక్కించడంలో ఎంత జాగ్రత్త వహిస్తారో, ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త వహిస్తారు. ఆ సినిమాని ఆడియన్స్ కి రీచ్ అయ్యేందుకు అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తారు.

ఈక్రమంలోనే ఛత్రపతి సినిమా సమయంలో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్ ని ప్లాన్ చేశారు. ఛత్రపతి మూవీ యూనిట్ అంతా కలిసి రెండు టీంలుగా విడిపోయి క్రికెట్(Cricket) ఆడి ఆడియన్స్ ని అలరించారు. ఆ ఆటని కూడా రాజమౌళి ఒక సినిమా లాగానే తెరకెక్కించారు. ఛత్రపతి సినిమా తెరకెక్కించిన విషయంలో నేను గొప్పంటే నేను గొప్ప అని ప్రభాస్, రాజమౌళి గొడవ పడతారు. ఆ గొడవతో ఇద్దరు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంటారు. దీంతో యాక్టర్స్ (ప్రభాస్) టీం, టెక్నీషియన్స్ (రాజమౌళి) టీం అంటూ రెండు వర్గాలుగా విడిపోయి పోటీ పడ్డారు.

ఇక ఈ పోటీలో ముందుగా ప్రభాస్ టీం బ్యాటింగ్ కి దిగి 25 ఓవర్స్ లో 8 వికెట్స్ కోల్పోయి 159 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో ప్రభాస్ సిక్సర్లు, ఫోరులతో అదరగొట్టారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన రాజమౌళి టీం.. చివరిలో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ప్రభాస్ టీంని ఓడించారు. ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ ఆ మ్యాచ్ సమయంలో చేసిన అల్లరి చూస్తే.. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అసలు మాట్లాడడానికి సిగ్గుపడే మన ప్రభాసేనా ఇంత అల్లరి చేస్తుంది అనే సందేహం కలుగుతుంది. మరి ఆ మ్యాచ్ వీడియో మొత్తాన్ని ఒకసారి మీరుకూడా చూసి ఎంజాయ్ చేయండి.

Also Read : Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?

  Last Updated: 28 Jan 2024, 08:49 PM IST