Site icon HashtagU Telugu

Silk Smitha: సిల్క్ స్మిత సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో చూశారా..? వింటే కన్నీళ్లు వస్తాయి

Whatsapp Image 2023 04 30 At 23.15.03

Whatsapp Image 2023 04 30 At 23.15.03

Silk Smitha: సిల్క్ స్మిత గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఐటెం సాంగ్స్ కుర్రాళ్లను ఒకప్పుడు ఉర్రూతలూగించింది. ఆమె డ్యాన్సులు చూసేందుకే సినిమాకు వెళ్లేవారు చాలామంది ఉండేవారు. అంతగా ఆమె సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. యువతలో అప్పట్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రలో నటించి కుర్రాళ్లను మైమరిపించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో సిల్క్ స్మిత ఉండాలని కోరుకునేవాళ్లు. ఆమె సినిమాలో ఉంటే సినిమా హిట్ అవుతుందని భావించేవారు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా గ్లామరస్ పాత్రలలో నటించి సిల్క్ స్మిత మంచి పేరు సంపాదించుకుంది. అయితే సిల్క్ స్మిత తన జీవితంలో ఎన్నో కష్టలను ఎదుర్కొంది. ఎన్నో బాధతలతో మనోవేదను గురై ఆత్మహత్య చేసుకుంది. సినిమా అవకాశాలు రాక, జీవితంలో బాధలు ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ఓ సీనియర్ హీరో కారణమనే ఆరోపణలు ఉన్నాయి.

ఓ సీనియర్ హీరో వల్ల అవకాశాలు రాలేదని, సిల్క్ స్మిత కెరీర్ నాశనం కావడానికి అతడే కారణమనే ప్రచారం ఉంది. సినిమా అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కు గురైన సిల్క్ స్మిత.. చివరికి బలవన్మరణానికి పాల్పడింది. 1996లో స్మిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తనను నమ్మినవారే తనను మోసం చేశారని, తనకంటూ ఎవరూ లేదని ఆమె లేఖలో రా శారు. తన సొమ్ము తిన్నవాళ్లే తనను మోసం చేశారని, మనశాంతి లేకుండా చేవారని పేర్కొన్నారు. తన ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నానని, వాళ్లే తనను మోసం చేశారని సిల్క్ స్మిత తెలిపింది.ఇది రాయడానికి తాను ఎంత నరకం అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనని, దేవుడుంటే వారి సంగతి చూస్తాడంటూ సిల్క్ స్మిత లేఖలో పేర్కొన్నారు.