Mahesh Babu Unknown Facts: మహేష్ కు తెలుగు చదవడం, రాయడమూ రాదు!

టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో మహేష్ బాబు ఒకరు.

Published By: HashtagU Telugu Desk
Mahesh

Mahesh

టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో మహేష్ బాబు ఒకరు. లుక్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా ఉండే నటుడు. అయితే ప్రతి సినిమాలోనూ తన నటనతో, డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సూపర్‌స్టార్‌కి అసలు తెలుగు చదవడం, రాయడం రాదు. అవును ఇది నిజం. తెలుగులో డైలాగులు సులువుగా చెప్పినప్పటికీ తెలుగు భాష చదవడం, రాయడం రాదు. మరి మహేశ్ డైలాగ్స్ ఎలా నేర్చుకుంటాడు అని షాక్ అవుతున్నారా.. ఈ సూపర్ స్టార్ కు చిన్నప్పట్నుంచే మెమరీ బాగా ఉంది. సో మహేశ్ డైరెక్టర్స్ మాటల్ని బాగా మెమోరైజ్ చేసుకొని డైలాగ్స్ చెబుతారట. తెలుగు రాయకపోయినా డైలాగ్ డెలివరీలో మహేష్ అదరగొడుతాడు.

సినిమా ప్రమోషన్ల సందర్భంగా తనకు తెలుగు చదవడం, రాయడం నేర్చుకోలేదని వెల్లడించాడు. అయితే మహేశ్ తెలుగు నేర్చుకోలేకపోవడానికి కారణం చెన్నైలో స్కూలింగ్ జరిగింది. తమిళ నటులు కార్తీ, విజయ్ స్నేహితులు కూడా. ప్రస్తుతం SSMB28 పేరుతో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయిక. ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైంది, ఆగ‌స్ట్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా పేరు పెట్టని చిత్రం 2023 సమ్మర్‌లో పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. RRR దర్శకుడు SS రాజమౌళి ఓ సినిమాను చేయబోతున్నాడు.

  Last Updated: 27 Jul 2022, 05:23 PM IST