Site icon HashtagU Telugu

Sai Pallavi: సాయి పల్లవి మిస్ చేసుకున్న మూవీస్ ఇవే.. విజయ్ దళపతి, అజిత్ లకు సైతం నో!

Sai Pallavi

Sai Pallavi

2019లో విడుదలైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రొమాంటిక్ చిత్రం డియర్ కామ్రేడ్ తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించనప్పటికీ, ప్రేక్షకులతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాబీగా విజయ్ దేవరకొండ, లిల్లీగా రష్మిక మందన్న అద్భతంగా నటించారు. ఈ ఇద్దరి నటన, కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. ఈ మూవీలో ఓ సన్నివేశంలో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక పెదాలపై ముద్దు కూడా పెడతాడు. అయితే లిల్లీ పాత్రకు రష్మిక మందన్న మొదటి ఛాయిస్ కాదట.

డియర్ కామ్రేడ్‌లో లిల్లీ పాత్రకు మొదటి ఛాయిస్ సాయి పల్లవి. ఈ సినిమాలో విజయ్ సరసన నటించేందుకు మొదట ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే అనివార్య కారణాల వల్ల సాయిపల్లవి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. సాయి పల్లవి డియర్ కామ్రేడ్ మాత్రమే కాదు.. అజిత్ కుమార్ తునివు, తలపతి విజయ్ ‘లియో’ పాత్రల కోసం సాయి పల్లవిని సంప్రదించారు. అయితే పాత్రలకు వెయిటేజీ లేకపోవడంతో సాయిపల్లవి వాటిని తిరస్కరించారు. తునివులో అజిత్ కుమార్‌తో మంజు వారియర్ నటించగా, లియోలో తలపతి భార్యగా త్రిష నటించనుంది.

Also Read: Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!