Site icon HashtagU Telugu

Prabhas Hobby: సినిమాల్లోకి రాకపోయుంటే ప్రభాస్ ఏంచేసేవాడో తెలుసా!

Prabhas

SS రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్-ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూపర్‌స్టార్‌లలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్థాయిలో కథలు పుట్టుకొస్తున్నాయంటే ఈ హీరో రేంజ్ ఏంటో ఇట్టే అర్ధమవుతోంది. యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయూంటే ఏంచేసేవారు? ఏ రంగంలో సెటిల్ అవుతారు? అనే విషయాల పట్ల ఆయన అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే హోటల్ పరిశ్రమను వృత్తి భావించేవారు. ప్రభాస్ మంచి నటుడే కాదు.. భోజన ప్రియుడు కూడా. ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యమైన ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతాడు కూడా.

సినిమాల్లోకి రాకపోయుంటే ప్రభాస్ హోటళ్ల వ్యాపారం చేయాలని ఆకాంక్షించారు. ఆహారానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అతనికి ఉన్న అవగాహాన, ఆసక్తి చాలా సందర్భాల్లో బయట పడింది కూడా. ప్రభాస్ ఏదైనా సినిమా షూటింగ్ జరుపుకునే సమయంలో తన తోటి నటులకు, హీరోయిన్స్ లంచ్ లేలా డిన్నర్ ఆఫర్ చేస్తుంటాడు కూడా. తోటి నటులకు దగ్గరుండి భోజనాన్ని వడ్డిస్తాడు కూడా. అంతేకాదు.. ప్రభాస్ వివిధ వంటకాలను ప్రయత్నించడాన్ని ఇష్టపడతాడు.

ప్రభాస్ తదుపరి చిత్రం KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్‌లో కనిపించనున్నాడు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్‌లతో స్క్రీన్‌ను పంచుకోనున్నాడు. చాలా కాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకోవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని కొన్ని సాంకేతికంగా అధునాతన చిత్రాలతో సాలార్ ఒకటి. అతిపెద్ద యాక్షన్ చిత్రంగా భావిస్తున్నారు. బాలీవుడ్ యానిమేషన్ చిత్రం ఆదిపురుష్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరో భారీ మూవీ ప్రాజెక్టు కే మూవీలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.