Balayya: బాలయ్య మీదకు రోజా రెచ్చగొట్టిందా.. ఆమె మాటల్లో అర్థం అదేనా?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా, హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలయ్య చుట్టూ ఓ వివాదం అల్లుకుంది.

Published By: HashtagU Telugu Desk
Will Balakrishna Feel Bad If He Talks About Ntr Like That Rojas Comments On The Balayya Controversyd

Will Balakrishna Feel Bad If He Talks About Ntr Like That Rojas Comments On The Balayya Controversyd

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా, హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలయ్య చుట్టూ ఓ వివాదం అల్లుకుంది. నందమూరి బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేగగా.. బాలయ్య అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద దుమారం చిలికి చిలికి గాలి వానగా మారుతున్నట్లు అనిపిస్తోంది.

‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలయ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. వీళ్లతో నాకు మంచి టైమ్ పాస్ అయ్యింది. వీళ్లతో కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం’ అని వ్యాఖ్యానించడం తీవ్రదుమారం రేపింది. ఈ వ్యాఖ్యలతో అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తాము అభిమానించే హీరోల కుటుంబాన్ని ఎలా చులకన చేసినట్లు మాట్లాడతారని మండిపడుతున్నారు.

కాగా నందమూరి బాలయ్య వ్యాఖ్యల మీద ఏపీ మంత్రి, నటి రోజా స్పందించారు. రోజా దీని గురించి మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ గురించి బాలయ్య అలా మాట్లాడటం చాలా తప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాసరావు గారిని ఏ విధంగా దూషించారో మనం చూశాం. అలాగే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కొడుకై.. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడటం చాలా తప్పు’ అని అన్నారు.

బాలయ్య మాటలపై రోజా మరింత స్పందిస్తూ.. ‘ఇదే ఎన్టీఆర్ ను వాళ్లు మాట్లాడితే వారికి ఎంత బాధ ఉంటుందో.. వీరికి కూడా అంతే బాధ ఉంటుంది. ఎన్టీఆర్ కు సమానమైన హీరో నాగేశ్వరరావు. ఆయనను ఇలా అంటే వారి కుటుంబం, వారి ఫ్యాన్స్ కూడా బాధపడతారో అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి. సో ఎంత పడితే అంత మాట్లాడేయడం అనేది బాలయ్యకు ఎప్పుడు ఉంటే అలవాటే. దానికి ఇప్పటి వరకు ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు. మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించాలి’ అని అన్నారు.

అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించాలి, ఇప్పటి వరకు బాలయ్యకు పనిష్మెంట్ రాలేదు కాబట్టి దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియదన్నట్లు రోజా మాట్లాడటం.. ఒకరకంగా అక్కినేని ఫ్యాన్స్ ఆమె రెచ్చగొట్టినట్లు అనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  Last Updated: 25 Jan 2023, 07:53 PM IST