Radhe Shyam: వామ్మో.. 400 కోట్ల ఓటీటీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశారా?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన ‘‘రాధే శ్యామ్’’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

  • Written By:
  • Updated On - January 27, 2022 / 02:35 PM IST

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన ‘‘రాధే శ్యామ్’’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఓటీటీ దిగ్గజం డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం రూ.400 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ, రాధే శ్యామ్ మేకర్స్ ఆఫర్‌ను తిరస్కరించారు. థియేటర్లలో విడుదల చేయడానికి ఈ టీమ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది!

OTT కోసం 400 కోట్లు ఆఫర్ చేశారా?

డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ పీరియాడికల్ రొమాంటిక్ చిత్రం. కోవిడ్ -19 మహమ్మారి మూడో వేవ్ జనవరి 14 న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ మేకర్స్ OTT దిగ్గజం నుంచి అదిరిపోయే ఆఫర్‌ను అందుకున్నారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డైరెక్ట్ OTT స్ట్రీమింగ్ కోసం రూ. 400 కోట్లను ఆఫర్ చేసింది. టెంప్టింగ్ ఆఫర్ అందుకున్నప్పటికీ, మేకర్స్ థియేట్రికల్ రిలీజ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే డీల్‌కు నో చెప్పారు. జనవరి 26 న, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ట్విట్టర్‌లో రాధే షాయం త్వరలో థియేటర్లలో విడుదల కానుందని స్పష్టం చేశారు. “ప్రేమ, సంస్కృతిలో గొప్ప దేశానికి హ్యాపీయెస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. #రాధేష్యామ్ త్వరలో థియేటర్లలో’’ అంటూ రియాక్డ్ అయ్యారు. కాగా రాధే శ్యామ్ మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

పాన్ ఇండియాగా

తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ పాన్ ఇండియాలో విడుదల కానుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ప్రభాస్ హస్తసాముద్రికుడైన విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా, పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. రాధే శ్యామ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సత్యరాజ్, జగపతి బాబు, ప్రియదర్శి, మురళీ శర్మ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సాంకేతిక బృందంలో సభ్యులు.