Site icon HashtagU Telugu

Samantha-Naga Chaitanya: సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమా.. తీన్మార్ మల్లన్న కామెంట్స్ వైరల్!

Samantha Naga Chaitanya

Samantha Naga Chaitanya

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య, సమంలు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై అనేక రకాలు వార్తలు కూడా వినిపించాయి. ఎవరికి వారు తమకు నచ్చినట్టు కామెంట్లు చేస్తూ, తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు.

సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్‌ డోస్‌ పెంచడమే కారణం అని అన్నారు. సమంత వ్యవహరించే తీరు అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని, పిల్లల విషయంలోనూ చైతూ, సమంత మధ్య ఇష్యూ అయ్యిందన్నారు. మరోవైపు అక్కినేని వ్యాపారాల్లో సమంత జోక్యం చేసుకుంటుందని ఇది కూడా ఈ ఇద్దరు విడిపోవడానికి కారణమని ఎవరికి తోచిన విషయాన్ని వాళ్లు చెబుతూ వచ్చారు. కానీ అసలు విషయం ఏంటనేది మాత్రం ఆ ఇద్దరికి, అక్కినేని ఫ్యామిలీకే తెలియాలి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం అదే అనే విషయం సంచలనం రేపుతుంది. తీన్‌ మార్‌ మల్లన్న ఈ విషయాన్ని చెబుతూ ఆయన షాకింగ్‌ ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. రాజకీయ నాయకులు, జడ్జ్ ల ఫోన్‌ నెంబర్లని కూడా ట్యాపింగ్‌ చేశారనే విషయం బయటకు వస్తుంది. ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని, వారి అండదండలతోనే పోలీస్‌ అధికారులు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారనే విషయం డీఎస్పీ కేసు విచారణలో బయటకు వస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కారణం వల్లే టాలీవుడ్‌లో ఒక ప్రముఖ హీరో, హీరోయిన్‌ విడిపోయారని, మూడు తరాలుగా సినిమాల్లో రాణిస్తున్న ఫ్యామిలీకి చెందిన హీరో, స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే విడాకులు తీసుకున్నారనే ఆరోపణలు వైరల్‌గా మారిన నేపథ్యంలో తాజాగా తీన్‌ మార్‌ మల్లన్న మాత్రం ఆ ఇద్దరు నాగచైతన్య, సమంతనే అని తెలుస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version