Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ : నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?

హీరో నాగ చైతన్య చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 03:25 PM IST

హీరో నాగ చైతన్య చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒక బాలీవుడ్‌ హీరోయిన్‌తో చైతన్య డేటింగ్‌ చేస్తున్నా డంటూ జోరుగా రూమర్స్ వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ అబద్ధాలని వారిద్దరూ ఇప్పటికే తేల్చి చెప్పారు. అయినా పట్టించుకోకుండా కొందరు రూమర్స్ వ్యాప్తిని కొనసాగిస్తున్నారు.

ఆ విధమైన ఆన్సర్ వల్లే..

లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగ చైతన్య రాపిడ్ ఫైర్ లో భాగంగా విజయ్ పేరు చెప్పగానే “క్రేజీ” అని జవాబు ఇచ్చారు. అలాగే హీరోయిన్ గురించి చెప్పగా ” ఇంట్రెస్టింగ్” అనే సమాధాణాన్ని చెప్పారు. అలాగే బంగార్రాజు మూవీ లో నటించిన కృతి శెట్టి పేరు చెప్పగానే ” ఆమె ఓ చిన్న పిల్ల” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. శోభితా ధూళిపాళ పేరు చెప్పగానే ముందుగా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత “గట్టిగా నవ్వాడు” నాగచైతన్య. ఈ ఆన్సరే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీళ్లిద్దరు లవ్ లో ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.

శోభితా ధూళిపాళ్ల ఏం చెప్పింది?

” చైతన్యకు, నాకు మధ్య ప్రేమ ఉందంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య అంత క్లోజ్ పరిచయం కూడా లేదు. ఒకటి రెండు సార్లు హాయ్, బాయ్ చెప్పుకున్నాం” అని
శోభితా ధూళిపాళ్ల పేర్కొంది.

నాగచైతన్య ఏమన్నాడు ?

“ఈ మధ్య నాపై రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం ఏదో ఒక పుకార్ బయటకు వస్తోంది. వాటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి అసలు సంబంధమే లేని పుకార్లు సృష్టిస్తున్నారు. అసలు అవి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ప్రారంభంలో వాటిని చూసి నవ్వుకునే వాడిని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు” అని నాగచైతన్య తేల్చి చెప్పారు.