Site icon HashtagU Telugu

Janhvi on Vijay: విజయ్ తో మ్యారేజ్ పై జాన్వీ షాకింగ్ కామెంట్స్!

Vijay And Janhvy1

Vijay And Janhvy1

జాన్వీ కపూర్ నటించిన మిలీ  మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తన సినిమాను ప్రమోట్ చేస్తూ ముంబైలో జాన్వీ సందడి చేస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ, అతని రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఒక సరదా ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఒకవేళ స్వయంవరం ఏర్పాటుచేస్తే ఎవరినీ పెళ్లి చేసుకుంటావని మీడియా రిపోర్ట్ అడిగారు.

జాన్వీ వెంటనే రణ్ బీర్ అని సమాధానమిచ్చింది. అయితే రణ్ బీర్ కు పెళ్లి అయ్యిందని, విజయ్ దేవరకొండ పేరును సజెస్ట్ చేయగా, ఆయనకు ప్రాక్టీకల్లీ పెళ్లి అయ్యిందని జాన్వీ నవ్వుతూ చెప్పింది. బోనీ కపూర్ ధూమపానం మానేయడానికి శ్రీదేవి నాన్ వెజ్ తినడం మానేసిందని జాన్వీ కపూర్ వెల్లడించింది. తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తో వర్క్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోనని జాన్వీ స్పష్టం చేసింది. సినిమాలతో సంబంధం లేకుండా జాన్వీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.