Site icon HashtagU Telugu

Chiru: మరో రీమేక్ పై చిరు కన్ను!

Chiru

Chiru

వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్ అయిన ‘గాడ్ ఫాదర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి మరో రీమేక్‌పై ద్రుష్టి పెట్టినట్టు టాలీవుడ్ టాక్. తాజాగా చిరంజీవి మరో మలయాళ రీమేక్‌ని సెట్స్‌పైకి తెస్తున్నారని, దానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కావచ్చని సమాచారం. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘బ్రో డాడీ’ కామెడీ ఎంటర్‌టైనర్. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, అయితే రీమేక్ వెర్షన్ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు, చిరంజీవి తన సినిమా ‘ఆచార్య’ విడుదల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రెండు సినిమాలు మేకింగ్‌లో ఉన్నాయి. ‘భోలా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నాడు. మెగా అభిమానులను నాన్ స్టాఫ్ గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Exit mobile version