Site icon HashtagU Telugu

Veerasimha Reddy: వీరసింహారెడ్డి నుంచి డైలాగ్ లీక్…ఈ రేంజ్ లో ఉంటే థియేటర్లు దబిడిదబిడే..!!

Nbk

Nbk

నందమూరి నటసింహం బాలయ్యబాబు నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఓ మాస్ డైలాగ్ లీక్ అయ్యింది. ఆ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు మూవీ మేకర్స్. ఇక బాలయ్యబాబు సినిమాలంటే ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో భారీ ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా ఈ మూవీలో ప్రతి డైలాగ్ ఉంటుందని మూవీ మేకర్స్ అంటున్నారు.

బాలయ్య నుంచి ఎక్కువగా ఫ్యాన్స్ కోరుకునేది డైలాగ్స్. మాస్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్…ఇవన్నీ బాలయ్య మూవీకి హైలెట్. దీంతో రాబోయే వీరసింహారెడ్డి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. NBK 107 గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి…శుక్రవారం కర్నూల్ కొండారెడ్డి బురుజుపై టైటిల్ రిలీజ్ చేశారు. బాలయ్యకు తగ్గట్లుగానే ఈ టైటిల్ ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఓ డైలాగ్ ను రిలీజ్ చేశారు. వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అనే డైలాగ్ తోపాటు మరిన్ని డైలాగులు ఉన్నాయని తెలిపారు.