Dil Raju: ఈ మూవీ చూస్తున్నంత సేపు నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు!

  • Written By:
  • Updated On - March 30, 2024 / 10:23 PM IST

Dil Raju: దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్న ‘లవ్ మీ’ మూవీలో యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో.. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణి గారు ఈ పాటను పాడించారు.

నేను కూడా ఇంతలా హమ్ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి గారు ఎంతో మెలోడియస్‌గా ట్యూన్ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. చాలా ఎగ్జైటింగ్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నీ కొత్త కథలు దొరకవు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ ఆడుతుండాలి. ఇది చాలా కొత్త కథ అని మాత్రం నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు. సినిమా అంతా అయ్యాకే ఆడియెన్స్‌కు అర్థం అవుతోంది.

ఇది చాలా న్యూ అటెంప్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కొత్తగా ట్రై చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేశారని ఆశిష్‌కు సలహా ఇచ్చాను. ముందు నటుడిగా ఎదగమని సూచించాను. నా ఆలోచనను ఆశిష్ అర్థం చేసుకున్నారు. ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు’ అని అన్నారు.