నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) తెరంగేట్రానికి సంబందించిన అప్డేట్ ఈమధ్యనే వచ్చింది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమాను బాలకృష్ణ (Balakrishna) చిన్న కూతురు తేజశ్విని నిర్మిస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే భారీ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో విలన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో తనయుడు చేస్తున్నాడని టాక్. ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రం తనయుడు ధృవ్ విక్రం ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే అతనితో కథా చర్చలు జరిగాయని సినిమాకు అతను దాదాపు ఓకే చెప్పారని తెలుస్తుంది. తమిళంలో ధృవ్ (Dhruv) స్టార్ డం కోసం ప్రయత్నిస్తున్నాడు.
మోక్షజ్ఞ తో తలపడే విలన్..
ఐతే తండ్రిలానే తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో ధృవ్ ప్రయత్నిస్తున్నాడు. ఐతే తెలుగులో హీరోగా కన్నా విలన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. మోక్షజ్ఞ తో తలపడే విలన్ గా ధృవ్ అదరగొట్టబోతున్నాడు. ఐతే నిజంగానే ధృవ్ ఈ సినిమాలో విలన్ గా చేస్తాడా లేదా అన్నది చూడాలి.
మోక్షజ్ఞ సినిమాలో ధృవ్ ఉన్నది నిజమే అయితే నిజంగానే ఫ్యాన్స్ కు పండగ అన్నట్టే. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. పురాణాల నేపథ్యంతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Ka : రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ‘క’..ఇది కదా హిట్ అంటే..!!