Site icon HashtagU Telugu

Dhootha: యానిమల్ ఊచకోత.. దుమ్ముదులుపుతోన్న దూత.. 24 గంటల్లో నంబర్ వన్

dhootha series

dhootha series

Dhootha: అటు థియేటర్లో యానిమల్ సినిమా కలెక్షన్లతో ఊచకోత కోస్తోంటే.. ఇటు ప్రైమ్ వీడియోలో దూత దుమ్ముదులిపేస్తోంది. అసలుసిసలైన థ్రిల్లర్ మజాను అందరికీ పరిచయం చేస్తోంది దూత వెబ్ సిరీస్. పాజిటివ్ టాక్ తో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. రిలీజైన 24 గంటల్లోనే అమెజాన్ ప్రైమ్ లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో యువసామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత . సూపర్ నేచురల్ థ్రిల్ గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లాగే అందరినీ థ్రిల్ కు గురిచేస్తూ.. ఓటీటీ ప్లాట్ ఫాం ప్రైమ్ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఈ సిరీస్ లో నాగచైతన్య జర్నలిస్ట్ గా నటించాడు. ఈ సినిమాతో చైతూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. పేపర్ స్లిప్పులలో వచ్చే వార్తలు ఉన్నట్టే తన జీవితంలో జరగడం.. అది ఒక మర్డర్ తో కనెక్ట్ అవడం, మధ్యలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ సిరీస్ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. ఫెయిల్యూర్ లో ఉన్న నాగచైతన్యకు మంచి హిట్ హిట్ అందించింది.

 

Exit mobile version