Site icon HashtagU Telugu

Dhootha Trailer : నాగ చైతన్య ‘దూత’ ట్రైలర్ టాక్

Dhootha Trailer

Dhootha Trailer

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కేవలం సినిమాలే కాక వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన దూత (Dhootha) అనే ఓ వెబ్ సిరీస్‌లో చేస్తున్నాడు. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నాచురల్ హారర్ కథతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. మరో కీలక పాత్రలో మలయాళీ నటి పార్వతి నటిస్తోంది. స్ట్రీమింగ్ కు దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు గురువారం ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ లో ప్రేక్షకులకు కావాల్సినన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ గా ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య ఒక జర్నలిస్ట్ గా కనపడబోతున్నట్టు, ఒక దినపత్రికని స్థాపించబోతున్నట్టు, అతనికి గతం తాలూకు ఏవో వెంటాడుతున్నట్టు, అనుకోకుండా అతని చుట్టూ హత్యలు, వాటిల్లో అతను ఇరుక్కుంటున్నట్టు చూపించారు. “మేము మెసెంజర్స్ తెలుగులో చెప్పాలంటే దూతలు” అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ అండ్ బీజీయం హైలెట్ గా నిలిచాయి. సుమారు 2 నిమిషాల 24 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షాట్స్ ఎక్కువగా చూపించారు. దీన్నిబట్టి సిరీస్ అంతా ట్విస్టులు, సస్పెన్స్ లతోనే ఉండబోతుందని అర్థమవుతుంది.

ఈ వెబ్ సిరీస్ భారతదేశంలొనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లను ప్రసారం చేస్తున్నారు.

Read Also : Kannappa First Look : మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్