Dhirubhai Ambani Car : ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ జయంతి. ఆయన 1932 సంవత్సరం డిసెంబరు 28న గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా మాలియా తాలూకాలోని చోర్వాడ్ గ్రామంలో జన్మించారు. ధీరూభాయ్ అంబానీ తండ్రి పేరు హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ. చోర్వాడ్ గ్రామంలో సాధారణ టీచరుగా హీరాచంద్ పనిచేసేవారు. వారిది మోధ్ బనియా కులం. ధీరూభాయ్ అంబానీ తల్లి పేరు జమునాబెన్ అంబానీ. యెమన్ దేశంలోని ఒక పెట్రోలు పంప్‌లో కార్మికుడిగా పనిచేసిన ధీరూభాయ్ అంబానీ తదనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను శాసించే పారిశ్రామిక దిగ్గజం స్థాయికి ఎదిగారు. ఆయన అప్పట్లోనే లగ్జరీ కార్లను వాడేవారు. ప్రత్యేకించి అమెరికా కార్ల కంపెనీ ఫోర్డ్‌కు చెందిన లగ్జరీ కారు క్యాడిల్లాక్‌ను ధీరూభాయ్(Dhirubhai Ambani Car) ఇష్టంగా వినియోగించేవారు.
Also Read :Manmohan Last Rites : ఉదయం 11.45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు
1960వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు క్యాడిల్లాక్ కార్లనే వాడేవారు. దాన్ని ఆనాడు స్టేటస్ సింబల్‌గా భావించేవారు. 1958లో తొలిసారిగా క్యాడిల్లాక్ కారును ధీరూభాయ్ కొన్నారు. అప్పట్లో ఆ కారును మూడు వేరియంట్‌లలో విక్రయించేవారు. కాడిలాక్ ఎస్కలేడ్, కాడిలాక్ CTS, కాడిలాక్ STS. ఈ మూడు వాహనాల రేట్లు కూడా చాలా ఎక్కువ. ఆనాడు క్యాడిల్లాక్ కారు సగటు ధర దాదాపు రూ. 45 లక్షల దాకా ఉండేదట. ఇందులో 3249cc కెపాసిటీ కలిగిన 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది. ఈ కారులో 65 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉండేది. ఈ కారు హైవేపై లీటరు ఇంధనానికి 14 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేది. సిటీ రోడ్లపైనా ఈ కారు లీటరు ఇంధనానికి 11 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఆ టైంలోనే ఈ కారులో పవర్ స్టీరింగ్ అందుబాటులో ఉండేది. ప్రస్తుతం మన దేశంలో ఈ కార్లను విక్రయించడం లేదు.
Also Read :Ratan Tata : రతన్ టాటా యువ తరానికి ఎందుకు రోల్ మోడల్..?
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన క్యాడిల్లాక్ కారు ధీరూభాయ్ అంబానీ వద్ద ఉండేది. అయితే ఆ కారు తదుపరిగా ఒక సౌత్ సూపర్ స్టార్ వద్దకు చేరింది. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ ? అంటే.. మోహన్‌లాల్ విశ్వనాథన్ . ఈయన మలయాళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. అయితే ఈ కారును మోహన్‌లాల్ నేరుగా కొనలేదు. ఆయన మామగారు ఈ కారును ధీరూభాయ్ అంబానీ కుటుంబం నుంచి కొని మోహన్‌లాల్‌కు ఇచ్చారట.