Site icon HashtagU Telugu

Dhee: ఆ నాలుగు సినిమా పోటీగా థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతున్న ఢీ.. విడుదల తేదీని మారిస్తే బాగుంటుందంటూ!

Dhee

Dhee

మంచు విష్ణు కెరియర్ లో బెస్ట్ ఎంటర్టైనర్ సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఢీ. ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి విష్ణు అలాగే బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007లో విడుదల అయ్యే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీహరి కూడా ఇందులో నటించారు. ఈ సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు గడిచిపోయిన కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఈ సినిమా క్లిప్స్ కనిపిస్తూనే ఉంటాయి.

ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి విడుదల కావడానికి సిద్ధం కాబోతోంది. మార్చి 28వ తేదీన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఇదే విషయాన్ని హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అదేమిటంటే మార్చి 28వ తేదీన మరో రెండు కొత్త సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్గా నటించింది.

ఇదే రోజు మ్యాడ్ సినిమాకు సీక్వల్గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలకు ఒక్కరోజు ముందు అనగా మార్చి 27వ తేదీన విక్రమ్ నటించిన వీరధీర శూర పార్ట్ 2 రాబోతోంది. తెలుగు హక్కులకు సంబంధించిన డీల్స్ ఒక కొలిక్కి రానున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఈ సినిమాలతో పాటు మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ సినిమా కూడా మార్చి 27న విడుదల కానుంది. అంటే ఇప్పుడు మొత్తం నాలుగు క్రేజీ సినిమాలు బరిలో ఉన్నప్పుడు ఢీని రీ రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదేమోనని మూవీ లవర్స్ ఫీలవుతున్నారు. ఎందుకంటే యూత్, ఫామిలీస్ ఇద్దరూ ఎంజాయ్ చేసే కంటెంట్ ఇందులో ఉంది. విష్ణు ఫాలోయింగ్ సంగతి పక్కన పెడితే ఢీ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేసే జనాలు మాత్రం భారీగా ఉంటారు. కాకపోతే సరిపడా థియేటర్లు, షోలు ఉంటే నాలుగైదు రోజులు మంచి వసూళ్లతో పాటు రన్ దక్కుతుంది. మరి అనుకున్న సమయానికి నాలుగు సినిమాల మధ్యలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా లేదంటే పోస్ట్ ఫోన్ చేస్తారా అనేది చూడాలి మరి. అభిమానులు మాత్రం విడుదల తేదీని వాయిదా వేస్తేనే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.