Dhanush: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ త్రిభాషా చిత్రం షురూ!

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు.

Published By: HashtagU Telugu Desk
Dhanush

Dhanush

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్ విజయాలని అందుకొని, పాత్ బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని, విడుదల కానుంది.

నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

  Last Updated: 28 Nov 2022, 11:49 PM IST