కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanus) ఎలాంటి సినిమా చేసినా సరే దానికో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ధనుష్ ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు కొన్ని వెరైటీ కథలతో వస్తాడు. అవి ధనుష్ కి సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా తన రేంజ్ ని పెంచేస్తున్నాయి. సినిమా సినిమాకు ధనుష్ వర్సటాలిటీ చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా నటిస్తున్నాడని తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ధనుష్ కుబేర గ్లింప్స్ సినిమాపై బజ్ పెంచింది. ఐతే ఈ సినిమాలో ధనుష్ కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గా కూడా మారుతున్నాడట.
ధనుష్ కి పాడటం అంటే చాలా ఇష్టం. వై దిస్ కొలెవెరి డి అంటూ యువతని ఉర్రూతలూగించిన ధనుష్ మళ్లీ తన గాత్రంతో అందరినీ అలరించాలని ఫిక్స్ అయ్యాడు. కుబేర (Kubera) సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ధనుష్ పాడబోతున్నారట. ఈ సాంగ్ కచ్చితంగా ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. కుబేర సినిమా తో మరోసారి ధనుష్ సింగర్ గా కూడా తన మార్క్ చూపించనున్నారు.
ధనుష్ ఈ ఇయర్ రాయన్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇడ్లీ కొడై సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దానితో పాటు కుబేరని పూర్తి చేయాలని చూస్తున్నారు.