Site icon HashtagU Telugu

Dhanush Rayan First Look : ధనుష్ రాయన్ లుక్ చూశారా..?

Mega Fans really happy for Rayan Success here is the reasone

Mega Fans really happy for Rayan Success here is the reasone

Dhanush Rayan First Look కోలీవుడ్ స్టార్ హీరో విలక్షణ నటుడు ధనుష్ రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ తెలుగులో మాత్రం రిపబ్లిక్ డే నాడు రిలీజ్ అయింది. అక్కడ ఇక్కడ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని కోలేదు. అయితే ఇలా ఆ సినిమా వచ్చిందో లేదో అలా మరో సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాడు ధనుష్. ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా రాయన్.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. రాయన్ ఫస్ట్ లుక్ లో ఎప్పటిలానే ధనుష్ వెరైటీ లుక్ కనిపించాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ధనుష్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమాలో మరో హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. ధనుష్ రీసెంట్ మూవీ కెప్టెన్ మిల్లర్ లో కూడా సందీప్ కిషన్ నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్లో డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ అటెంప్ట్ చేస్తున్న ధనుష్. ఈ రాయన్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ధనుష్ చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ అంచనాలకు తగినట్టుగానే ఫస్ట్ లుక్ ఉండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ధనుష్ 50వ సినిమాగా వస్తున్న రాయన్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ధనుష్ రాయన్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read : NTR Prabhas : ఎన్టీఆర్ ప్రభాస్ మధ్యలో యష్..!