Dhanush Raayan కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో ఆయనే స్వీయ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాయన్. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో చెఫ్ లుక్ తో మాసీగా కనిపించారు ధనుష్. ఈ సినిమాలో తెలుగు యువ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే సినిమాలో ధనుష్ బ్రదర్ సెల్వ రాఘవన్ కూడా భాగం అవుతున్నారు. సెల్వ రాఘవన్ కూడా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.
అయితే ధనుష్ రాయన్ కథ సెల్వ రాఘవన్ రాశాడని. ఆయన కథతో ధనుష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించారు సెల్వ రాఘవన్. ధనుష్ సొంతంగా ఈ కథ రాసుకున్నాడని. రాయన్ అతని డ్రీం ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ సినిమాలో తాను కేవలం నటించాను తప్ప ఎలాంటి స్క్రిప్ట్ సపోర్ట్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
ధనుష్ మెగా ఫోన్ పట్టి చేస్తున్న రెండో సినిమాగా రాయన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు ధనుష్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ భారీగా ఉన్నట్టు అర్ధమవుతుంది.
పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ సెకండ్ హాఫ్.. రెబల్ ఫ్యాన్స్ కి రచ్చ రంబోలానే..!