Site icon HashtagU Telugu

Kubera : కుబేర.. ఈ బ్యాక్ పోస్టర్ ఎవరిదో తెలుసా..?

Dhanush Nagarjuna Sekhar Kammula New Poster

Dhanush Nagarjuna Sekhar Kammula New Poster

Kubera శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా సునీల్ నారంగ్ నిర్మిస్తున్న కుబేర సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారని తెలిసిందే. సినిమా నుంచి ఈమధ్యనే ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా సినిమా షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ లో ఒకరు వెనక్కి తిరిగి కనిపిస్తుండగా అతని ఎదురుగా శేఖర్ కమ్ముల సోఫా లో సీన్ చెబుతున్నారు.

టక్ వేసుకుని వెనకాల భాగం కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జుననే. ఆయన జులపాల హుట్టు క్లాస్ లుక్ అచ్చం వింటేజ్ నాగార్జునని చూసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ధనుష్, నాగార్జున ఈ సూపర్ కాంబోలో వస్తున్న కుబేర సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అమ్మడు నటించడం కూడా ప్లస్ అని చెప్పొచ్చు. కుబేర సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు దేవి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తీసుకొస్తుందని చెప్పొచ్చు.