Site icon HashtagU Telugu

Dhanush Kubera Teaser : ధనుష్ కుబేర.. ఇది మామూలు స్పీడు కాదు బాబోయ్..!

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush Kubera Teaser కోలీవుడ్ స్టార్ తెలుగు క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మూవీ కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ తోనే బజ్ పెంచగా సినిమాపై ఈ క్రేజ్ మరింత పెంచేందుకు టీజర్ ను రెడీ చేస్తున్నారు మేకర్స్.

శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం అవుతుంది కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్తే హై స్పీడ్ తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ధనుష్ కుబేర సినిమాలో కూడా మేజర్ షెడ్యూల్ పూర్తైనట్టు తెలుస్తుంది. సినిమాను ఎక్కువ శాతం ముంబైలోనే తెరకెక్కిస్తున్నారని తెలిసిందే.

ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ కుబేర టీజర్ ను మే 2న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. టీజర్ తోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పరచేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ కాబోతున్న కుబేర సినిమా ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ ఉంటుందని టాక్.

సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది కూడా ఈ టీజర్ లో మెన్షన్ చేస్తారని చెప్పొచ్చు. కుబేర సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Chandini Chowdhary : ఆ హీరోయిన్ చేత S.R.H బెస్ట్ అనిపించేశారుగా..?