కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమాలో కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika) నటిస్తుంది. కుబేర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం Kubera సినిమాను ఫిబ్రవరి మూడో వారానికి రిలీజ్ లాక్ చేశారని తెలుస్తుంది. ఫిబ్రవరి 21న కుబేర రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. జనవరిలో సంక్రాంతి హడావిడి తర్వాత మళ్లీ ఫిబ్రవరిలో వరుస స్టార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నితిన్ తమ్ముడుతో పాటుగా నాగ చైతన్య తండేల్ కూడా రిలీజ్ లాక్ చేశారు.
రిలీజ్ డేట్ అనౌన్స్..
ఐతే మొదటి వారం పోటీలో ఎందుకని అనుకున్న కుబేర టీం మంత్ థర్డ్ వీక్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. కుబేర సినిమాలో ధనుష్ (Dhanush) వెరైటీ లుక్ తో కనిపిస్తున్నారు. కుబేర సినిమాను శేఖర్ కమ్ముల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు ఈ సినిమా పాన్ ఇండియా మొత్తం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా కథ నచ్చితేనే కానీ సినిమాను ఓకే చేయని ధనుష్ శేఖర్ కమ్ములకు ఓకే చెప్పాడంటే కచ్చితంగా కుబేర సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన గ్లింప్స్ కూడా అంచనాలు పెంచాయి.
Also Read : Bhagya Sri : భాగ్య శ్రీకి భలే ఆఫర్ తగిలిందే..!