Site icon HashtagU Telugu

Dhanush Kubera First Look : ధనుష్ కుబేర ఫస్ట్ లుక్.. మాటల్లేవ్ అంతే..!

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush Kubera First Look కోలీవుడ్ స్టార్ ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుంది అనుకుంటున్న ఆడియన్స్ కు టైటిల్ పోస్టర్ తోనే షాక్ ఇచ్చాఉ మేకర్స్. ఈ సినిమా టైటిల్ గా కుబేర అని ఫిక్స్ చేశారు.

అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో ధనుష్ లుక్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ చూసి మాటల్లేవ్ అంతే అనేస్తున్నారు ఆడియన్స్. కుబేర సినిమా ఎలా ఉండబోతుంది అన్నది సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే చెప్పేశాడు శేఖర్ కమ్ముల.

ఈ సినిమాలో నాగార్జున కూడా మరో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కుబేర లుక్ అదరగొట్టేసింది. ధనుష్ మార్క్ సినిమాగా ఈ కుబేర ఉండబోతుందని లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఇంతకీ ఈ కుబేర కథ ఏంటి.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. ధనుష్ కుబేర సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.