ఫెస్టివల్ వస్తుంది అంటే సెట్స్ మీద ఉన్న సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయి. ఈ క్రమంలో దీపావళికి స్టార్ సినిమాల నుంచి టీజర్, పోస్టర్స్ రానున్నాయి. ఈ దీపావళికి చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుందని తెలుస్తుండగా ఆ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటిన్ గా ఎదురుచూస్తున్నారు.
మరోపక్క దీపావళికి ధనుష్ నటిస్తున్న కుబేర (Kubera) సినిమా నుంచి కూడా టీజర్ వస్తుందని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేయవా సినిమా నుంచి టీజర్ దీవాళికి రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.
నేషనల్ క్రష్ రష్మిక..
ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తుంది. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే అంచనాలు పెంచేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత తన రెగ్యులర్ పంథా దాటి కుబేర సినిమా చేస్తున్నట్టు అర్ధమవుతుంది.
కుబేర సినిమాలో ధనుష్ (Dhanush) డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. తమిళ పరిశ్రమలో వర్సటైల్ యాక్టర్ గా మెప్పిస్తున్న ధనుష్ కుబేరతో మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని అంటున్నారు. దీపావళికి ధనుష్ కుబేర నుంచి వచ్చే టీజర్ లో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ధనుష్ కుబేర నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Krithi Shetty : అందాల బేబమ్మకు ఆఫర్లు మాత్రం లేవమ్మా..!