Site icon HashtagU Telugu

Dhanush : పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. కానీ ఎన్టీఆర్‌తోనే..

Dhanush, Pawan Kalyan, Ntr

Dhanush, Pawan Kalyan, Ntr

Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ఈ చిత్రం దర్శక బాధ్యతలను కూడా ధనుషే తీసుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వారం రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

తెలుగు హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా, ధనుష్ బదులిస్తూ.. ‘నాకు అందరి సినిమాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇతర హీరో అభిమానులు నన్ను తిట్టొకొవద్దు. ఎందుకంటే, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. ధనుష్ పవన్ పేరు చెప్పగానే.. ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది.

ఇక ఆ తరువాత తెలుగు మల్టీస్టారర్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారని.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ లో ధనుష్ ఎన్టీఆర్ పేరుని సెలెక్ట్ చేసుకొని.. తాను ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాయన్ సినిమా విషయానికి వస్తే.. ఒక రివెంజ్ డ్రామాతో తెరకెక్కింది. తన ఫ్యామిలీని చంపేసిన కిల్లర్స్ ని వెతుకుతూ వెళ్లిన హీరోకి ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ ఎదురవుతుంది. వారందరిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ.

Exit mobile version