మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా జీవిత కథను సినిమాగా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అరుణ్ మతేశ్వరన్ (Arun Matheswar) డైరెక్షన్ లో ధనుష్ (Dhanush) హీరోగా ఈ సినిమా రానుంది. ఐతే ఈ సినిమా విషయంలో ఎందుకో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట. బాలీవుడ్ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ని చేయాలని అనుకున్నారు.
కానీ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి మధ్యలోనే చేతులెత్తేశారట. ఐతే ఒక తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమాను టేకోవర్ చేయాలని చూస్తుంది. ఐతే సినిమా మొదలు పెట్టే ఆలోచన ఉంటే చెప్పండి అని ధనుష్ అన్నాడట. ప్రస్తుతం ధనుష్ కుబేర, ఇడ్లీ కొడై సినిమాల్లో నటిస్తున్నాడు. కుబేర సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకుంది.
మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా..
ఇళయరాజ తన బయోపిక్ కు తానే సంగీతాన్ని అందించాలని ఫిక్స్ అయ్యారు. దీనికి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఐతే ఇళయరాజాతో పనిచేసిన వారంతా చాలా వరకు ఉన్నారు. వారిని సినిమాలో తీసుకోవడం కాస్త కష్టమవుతుంది. అందుకే సినిమా నిర్మాణ భారం ఎక్కువ అవుతుందని తెలిసి లైట్ తీసుకున్నారట. మరి ఈ ఇళయరాజా బయోపిక్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ధనుష్ తో ఇళయరాజా (Ilayaraja) బయోపిక్ చేయాలన్న ఆలోచన మంచిదే. ఆ సినిమా కోసం ధనుష్ మేకోవర్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతల వెనకడుగు వల్ల ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. అసలు సినిమా ఉంటుందా లేదా అన్నది కూడా డౌట్ గా మారింది.
Also Read : Bujji Thalli Song : తండేల్ బుజ్జి తల్లి సాంగ్.. యూట్యూబ్ లో రేర్ రికార్డ్..!