Dhanush : ధనుష్ తో దిల్ రాజు ప్రాజెక్ట్ ఫిక్స్..!

Dhanush బడా నిర్మాత దిల్ రాజు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య తమిళ హీరో ధనుష్ తెలుగు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ ఆయన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో

Published By: HashtagU Telugu Desk
Dhanush

Dhanush

Dhanush బడా నిర్మాత దిల్ రాజు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య తమిళ హీరో ధనుష్ తెలుగు సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ ఆయన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ పనిచేయనున్నారని తెలుస్తుంది. ఈసారి ధనుష్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి పనిచేయనున్నారు.

శ్రీకారం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కిశోర్ డైరెక్షన్ లో ధనుష్ హీరోగా ఒక సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా కన్ ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ధనుష్ తో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ లాక్ చేశాడని తెలుస్తుంది. శ్రీకారం సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ సినిమా పాయింట్ బాగానే ఉంటుంది.

ఇప్పుడు ఆ డైరెక్టర్ ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడన్నది చూడాలి. ధనుష్ తెలుగులో తన మార్కెట్ పెంచుకునే క్రమంలో ఇక్కడ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. కుబేర సినిమా పోస్టర్ తోనే సినిమాపై బజ్ పెంచగా కిశోర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Rajinikanth : కూలీ కాపీ రైట్ ఇష్యూపై రజిని కామెంట్ ఇదే..!

  Last Updated: 04 May 2024, 11:24 PM IST