Site icon HashtagU Telugu

Dhanush : మాస్క్ లేకుండా చెత్తలో 10 గంటలు.. కుబేర కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్ ఇది..!

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush Turn Singer for Kubera Movie

Dhanush శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. కుబేర సినిమా ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచిన శేఖర్ కమ్ముల సినిమాను అంచనాలకు తగినట్టుగానే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమా కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్స్ అందరికీ తెలిసిందే. ఆయన చేసే ప్రతి సినిమాలో తన పాత్రతో అదరగొట్టేస్తున్న ధనుష్ కుబేర సినిమాలో బిచ్చగాడిగా కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ఏదైనా పాత్ర పర్ఫెక్ట్ గా రావడం కోసం ధనుష్ చాలా జాగ్రత్తపడుతుంటాడు. కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటిస్తున్న ధనుష్ చెత్త కుప్ప దగ్గర దాదాపు 10 గంటల పాటు ఉన్నాడట.

కనీసం ముక్కుకి మాస్క్ కూడా పెట్టకుండా ధనుష్ చెత్త కుప్ప దగ్గర ఉన్నాడని అంటున్నారు. ధనుష్ డెడికేషన్ లెవెల్స్ చూసి చిత్రయూనిట్ అంతా కూడా షాక్ అయ్యారట. ధనుష్ మార్క్ ప్రత్యేకమైన పాత్రతో కుబేర సినిమాలో కనిపించనున్నారు. తప్పకుండా ఈ సినిమా ధనుష్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు.

Also Read : Disha Patani Bikini Treat : ఆ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే..!