తమిళ్ స్టార్ డైరెక్టర్ కస్తూరి రాజా (Kasthuri Raja) వారసుడిగా హీరో ధనుష్(Dhanush) ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సినిమా రంగం పై ఆసక్తి లేకున్నా తండ్రి బలవంతం మీద సినిమాలోకి వచ్చారు. 2002లో తన కొడుకుని తానే పరిచయం చేస్తూ కస్తూరి రాజా తెరకెక్కించిన సినిమా ‘తుల్లువదో ఇలమై’ (Thulluvadho Ilamai). ఈ మూవీ విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ హీరోగా ధనుష్ మాత్రం ఎన్నో విమర్శలు అందుకున్నారు. ధనుష్ హీరో మెటీరియల్ కాదని, నటన కూడా తెలియదని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇక రెండో సినిమా ‘కాదల్ కొండెయిన్’ (Kaadhal Kondein) ని అన్నయ్య సెల్వ రాఘవన్ నిర్మాణంలో చేశారు ధనుష్. ఈ మూవీ షూటింగ్ సమయంలో ధనుష్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నట్లు ఒక సందర్బాల్లో అందరికి తెలియజేశారు. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కొందరు ధనుష్ దగ్గరకి వచ్చి.. “ఈ మూవీలో హీరో ఎవరు?” అని అడిగారట. ఇక అప్పటికే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ధనుష్ బయపడి.. వారికీ తానే హీరో అని చెప్పకుండా వేరే వ్యక్తి చూపించారట. అయితే కొంత సమయానికి ధనుషే హీరో అని వారికీ తెలిసిపోయింది.
ధనుషే హీరో అని తెలుసుకున్న ఆ కొందరు.. “హే చూడండ్రా, ఆటో డ్రైవర్ లా ఉన్నాడు వాడు సినిమాలో హీరో అంట” అని కామెంట్స్ చేశారట. అది విన్న ధనుష్ వాళ్ళని ఏమి అనలేక కారులో కూర్చొని బాగా ఏడ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ లా ఉంటే ఏంటి..? అతను మాత్రం హీరో కాకూడదా..? అంటూ తన బాధని ఒక ఇంటర్వ్యూలో ధనుష్ వెల్లడించారు. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ధనుష్.. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కెరీర్ మొదటిలో ‘అగ్లీ ఫేస్’ అని పిలిపించుకున్న ధనుష్.. హాలీవుడ్ హీరోతో ‘సెక్సీ తమిళ్ ఫ్రెండ్’ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు.
Also Read : Raghavendra Rao : సినిమాల్లో రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?