Dhanush Captain Miller కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో రఘువరన్ బీటెక్ లాంటి హిట్ అందుకున్న ధనుష్ లాస్ట్ ఇయర్ వచ్చిన సార్ తో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ధనుష్ (Dhanush) సినిమాలు తెలుగులో మంచి మార్కెట్ సంపాదించాయి. ఇక్కడ అతని ప్రతి సినిమా రిలీజ్ అవుతూ మంచి రెవిన్యూ రాబడుతున్నాయి. ఇక కెప్టెన్ మిల్లర్ (Captain Miller) సినిమా విషయానికి వస్తే ఆల్రెడీ తమిళంలో రిలజ్ట్ తెలుసు కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమా టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు. అయితే తమిళ సినిమా 2 గంటల 45 నిమిషాలు ఉండగా తెలుగులో కాస్త నిడివి తగ్గించినట్టు తెలుస్తుంది.
కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ 2 గంటల 34 నిమిషాలు అంటే 11 నిమిషాల సినిమా ట్రిం చేశారని తెలుస్తుంది. ఈ సినిమా లో ధనుష్ తో పాటుగా తెలుగు యువ హీరో సందీప్ కిషన్ కూడా ఒక మంచి పాత్రలో నటించాడు. అతను కూఆ ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
Also Read : Double Ismart : ఫైట్ కోసం ఏడున్నర కోట్లు.. డబుల్ ఇస్మార్ట్ పూరీ కెరీర్ లోనే హయ్యెస్ట్..!
ధనుష్ తెలుగు ఫ్యాన్స్ కెప్టెన్ మిల్లర్ ని ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమా రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ ప్లానింగ్ లో ఉన్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.