Site icon HashtagU Telugu

Captain Miller Digital Release Date : నెలలోపే ఓటీటీలోకి కెప్టెన్ మిల్లర్.. డిజిటల్ రిలీజ్ డేట్ లాక్..!

Dhanush Vetrimaran Combination Movie

Dhanush Vetrimaran Combination Movie

Captain Miller Digital Release Date ధనుష్ హీరోగా అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో వచ్చిన భారీ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అవగా తెలుగు వెర్షన్ ను జనవరి 26న రిలీజ్ చేశారు. తమిళంలో జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో అసలేమాత్రం బజ్ క్రియేట్ చేయలేదు. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు.

We’re now on WhatsApp : Click to Join

థియేటర్ లలో సినిమా అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో సినిమాను త్వరగానే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమాను అమేజాన్ ప్రైం డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 9న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమాలో ధనుష్ సరసన ప్రియంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.

సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. సినిమాలో మన తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ లాక్ చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్.. అనుకున్న డేట్ కి వచ్చేస్తున్నాడు..!