Site icon HashtagU Telugu

Dhanush Bonds: ఊటీలో కొడుకుతో ధనుష్.. నెటిజన్స్ ఫిదా!

Dhanush

Dhanush

తమిళ్ హీరో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి షేర్ చేశారు. సెల్వరాఘవన్ నేనే వరువెన్ సెట్స్ లో ఉన్న ధనుష్, తన పెద్ద కుమారుడు యాత్రాతో కలిసి గడుపుతున్న ఫొటో ఒకటి షేర్ చేశాడు. “ఈ స్టైల్ నేను ఇంతకు ముందు ఎక్కడ చూశాను? అంటూ రియాక్ట్ అయ్యాడు. కొడుకు హెయిర్ స్టైయిల్ ను సరిచేస్తూ కనిపించాడు. కొడుకులో తనను తాను చూసుకుంటూ మురిసిపోయాడు.

ధనుష్, ఐశ్వర్య 2004 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు. ఐశ్వర్య రజనీకాంత్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ధనుష్ చేసిన మొదటి పోస్ట్ ఇది. జనవరిలో విడిపోవడాన్ని ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశారు. “18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు కలిసి ప్రయాణం చేశాం. వ్యక్తిగత కారణాల వల్ల మనం విడిపోవాల్సి వచ్చింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. అభిమానులు వ్యక్తిగత స్వేచ్చకు భంగం కల్గించవద్దు.. అంటూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ మాళవిక మోహన్‌తో కలిసి నటించిన మారన్‌లో నటించనున్నాడు. మరోవైపు ధనుష్ నటించిన 3, వై రాజా వై వంటి చిత్రాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. షూటింగ్ నిమిత్తం ధనుష్ ప్రస్తుతంలో ఊటీలో ఉన్నాడు.