Site icon HashtagU Telugu

Rowdy Baby Step: రౌడీ బేబీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన ధనుష్,ప్రభుదేవా.. నెట్టింట వీడియో వైరల్!

Rowdy Baby Step

Rowdy Baby Step

రౌడీ బేబీ సాంగ్ గురించి మనందరికీ తెలిసిందే. తమిళ్ వర్షన్ అలాగే తెలుగు వర్షన్ సాంగ్లు యూట్యూబ్ లో రికార్డులను నమోదు చేశాయి. సామాన్యుల గురించి పెద్దపెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాట గుర్తింపులు వేశారు. ఇప్పటి ఇప్పటికీ ఎప్పటికీ ఈపాటికి ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఈ పాట వినిపిస్తే చాలు ముందుగా ఆ పాటలో సాయి పల్లవి అలాగే ధనుష్ కలిసి వేసిన స్టెప్పులు గుర్తుకు వస్తాయి. మీ డాన్సులకు యూట్యూబ్ షేక్ అయింది. అలాంటి సింపుల్ కొరియోగ్రఫీ అందించారు ప్రభుదేవా.

ఇప్పటికీ ఈ పాటకు బిలియన్లలో వ్యూస్ వస్తూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ రౌడీ బేబీ పాట విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే పాటకు ప్రభుదేవా అలాగే ధనుష్ ఇద్దరు కలిసి మరోసారి స్టెప్పులు వేశారు. మారి 2 మూవీ ఫ్లాప్ అయినా కూడా ఈ పాటతో సినిమా స్థాయి పెరిగిపోయింది. సాయి పల్లవి డ్యాన్స్‌కి ఉండే పవర్ ఏంటో ఈ పాట చూపిస్తుంది. అయితే తాజాగా ప్రభుదేవా కాన్సర్ట్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌ లో ఎస్ జే సూర్య చిందులు వేశాడు. ధనుష్ స్టేజ్ మీదే స్టెప్పులు వేశాడు. ప్రభు దేవాతో కలిసి ధనుష్ స్టేజ్ మీద రౌడీ బేబీ అంటూ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ పాట మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ధనుష్, ప్రభు దేవా సింపుల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

 

అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇద్దరు స్టెప్పులు అదిరిపోయాయి అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ప్రభు దేవా, జానీ మాస్టర్ కలిసి ఈ పాటకు కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కువ క్రెడిట్స్ మాత్రం ప్రభు దేవా మాస్టర్‌ కే వెళ్లింది. సాయి పల్లవి కోసమే చాలా మంది ఈ పాటను చూస్తారు. కానీ ఈ పాట సక్సెస్ క్రెడిట్స్ ధనుష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అలా రౌడీ బేబీ పాట మాత్రం యూట్యూబ్ నుంచి అందరి గుండెల్లోకి వెళ్లిపోయింది. తాజాగా ప్రభుదేవా ధనుష్ ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ పాటను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు.