Site icon HashtagU Telugu

Dhanush and Nagarjuna Fight : స్టార్ హీరోలు ఇద్దరు కొట్టుకున్నారా..?

Dhanush And Nagarjuna Fight For Kubera Sekhar Kammula Movie

Dhanush And Nagarjuna Fight For Kubera Sekhar Kammula Movie

Dhanush and Nagarjuna Fight ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఇంపార్టెంట్ రోల్ లో కింగ్ నాగార్జున నటిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో పోలీస్ రోల్ లో కనిపిస్తారని టాక్. ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ తోనే సర్ ప్రైజ్ చేశాడు శేఖర్ కమ్ముల.

సినిమాలో ధనుష్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ధనుష్, నాగార్జున మధ్య ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారని సమాచారం. అదేంటి ధనుష్, నాగార్జున మధ్య ఫైట్ పెడితే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే.. ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా ఈ సీన్ ఉంటుందట. ఐతే ఫైట్ లో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు.

ధనుష్ నాగార్జున ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కచ్చితంగా సంగీతం పరంగా కూడా అదరగొట్టేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున రోల్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read : Allari Naresh Bacchala malli Business : అల్లరోడి సినిమకు సూపర్ బిజినెస్.. సినిమా పూర్తి కాకుండానే భారీ డీల్..!