Dhanraj Ramam Raghavam First Glimpse జబర్దస్త్ వేణు డైరెక్టర్ గా చేసిన బలగం సూపర్ హిట్ కాగా ఇప్పుడు అతని దారిలోనే మరో కమెడియన్ ధన్ రాజ్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. ధన్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రామం రాఘవం. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే నాడు ఒక వీడియో గ్లింప్స్ వదిలారు.
నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న అంటూ ధన్ రాజ్ చెప్పిన డైలాగ్ తో ఈ గ్లింప్స్ వచ్చింది. సినిమాలో ధన్ రాజ్, సముద్రఖని తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి రీసెంట్ గా విమానం సినిమాను డైరెక్ట్ చేశారు. బలగం సినిమా హిట్ అవ్వడంతో ధన్ రాజ్ కూడా డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
కథా బలం ఉన్న సినిమాలు.. ఎమోషనల్ కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని ఎప్పటికప్పుడు వస్తున్న సినిమాలతో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ధన్ రాజ్ రామం రాఘవం సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా కథ ఎలా ఉంటుందో చూడాలి.