Site icon HashtagU Telugu

Dhamaka Trailer: ధమాకా మూవీ నుంచి ట్రైలర్.. ఎప్పుడంటే..?

DHAMAKA

Cropped (3)

మాస్ మహారాజా రవితేజ తదుపరి మూవీ ధమాకా (Dhamaka) డిసెంబర్ 23న విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ధమాకా (Dhamaka) చిత్రాన్ని డిసెంబర్ 23, 2022న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి ముందు థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 15, 2022న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం ప్రకటించింది.

తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రవితేజ మాస్‌ డైలాగ్‌లతో మెప్పించాడు. ఈ నెల 15న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మరోవైపు రవితేజ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ రోల్‌ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా టైటిల్ ఇదే.. భవదీయుడు భగత్‌సింగ్‌ కాదు.. ఉస్తాద్ భగత్‌సింగ్..!