Jinthaak Lyrical Song: 25 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన “ధమాకా” జింతాక్ సాంగ్

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్

Published By: HashtagU Telugu Desk
Dhamaka1

Dhamaka1

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. “ధమాకా” ఆల్బమ్ లోని జింతాక్ పాట మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా జింతాక్ పాట 26 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ సాంగ్ గా అలరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మాస్ డ్యాన్స్ ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు అన్ని వర్గాల నుండి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. ప్రతి రెండు రోజులకు వన్ మిలియన్ వ్యూస్ పెంచుకుంటూ యూట్యూబ్, మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో దూసుకుపోతుంది జింతాక్ సాంగ్.

జింతాక్ పాటలో రవితేజ మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇటివలే చిత్ర యూనిట్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ధమాకా’ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

  Last Updated: 31 Oct 2022, 11:22 AM IST