Jinthaak Song Teaser: ధమాకాలో దుమ్మురేపిన ‘జింతక్’ సాంగ్ టీజర్ చూశారా!

ధమాకా (Dhamaka) మేకర్స్ జింతక్ వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Dhamaka1

Dhamaka1

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించిన ధమాకా (Dhamaka) మూవీ టాలీవుడ్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. 2022 ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయినా ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ధమాకా మేకర్స్ ఇప్పటికే పల్సర్ బైక్ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ మరోసారి జింతక్ వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రవితేజ మాస్ స్టెప్పులు, శ్రీలీల అందాలు ఆకట్టుకున్నాయి.

100 కోట్ల క్లబ్ లోకి?

‘ధమాకా’ (Dhamaka) మూవీ ఇప్పటికే 96  కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు తెలుస్తోంది. కేవలం ఐదు రోజుల్లో 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు రోజు ఆ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 96 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం పేర్కొంది.

‘ధమాకా’ తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వసూళ్ళలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, ‘ధమాకా’ అలా కాదు… నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు (Collections) పైగా కలెక్ట్ చేసిన ‘ధమాకా’ నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వారంరోజులకే 96 కోట్లను షేర్ చేసింది.

Also Read: Chiranjeevi Properties: ‘రియల్’ మెగాస్టార్.. చిరంజీవి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  Last Updated: 04 Jan 2023, 05:21 PM IST