Pushpa 2: పుష్ప 2 నుంచి మొదటి పాట విడుదల కానుందా.. భారీ ఎత్తున ప్రమోషన్స్?

  • Written By:
  • Updated On - March 18, 2024 / 02:11 PM IST

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. ఈ సినిమా ఈసారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2 ఉండబోతుందని తెలుస్తోంది. కాగా పుష్ప పార్ట్ 1 లో నటనకు బన్నీ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది బర్త్ డేకి టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిన మూవీ టీం, ఈసారి సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట.

పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సెకండ్ పార్ట్ మ్యూజిక్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ కూడా అందుకు తగ్గట్లు మ్యూజిక్ ట్రాక్స్ ని సిద్ధం చేసినట్లు సమాచారం.మరి ఈసారి బర్త్ డే గిఫ్టుగా సాంగ్ నే రిలీజ్ చేస్తారా? లేదా ఇంకేమైనా క్రేజీ అప్డేట్ తో వస్తారా? అన్నది చూడాలి మరి. అయితే ఎక్కువ శాతం పుష్ప2 నుంచి పాటనే విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. కాగా పుష్ప 1 మూవీ సమయంలో టైం లేక ప్రమోషన్స్ ని పెద్దగా నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రమోషన్స్‌లో తగ్గేదేలే అన్నట్లు ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి తన సినిమాలు కోసం చేసే ప్రమోషన్స్ రేంజ్ లోనే పుష్ప 2 ప్రమోషన్స్ ని కూడా నిర్వహించనున్నారనే సమాచారం.