Site icon HashtagU Telugu

Devil Trailer : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ టాక్ …

Devel Trailer

Devel Trailer

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , సంయుక్త మీనన్‌ (Samyuktha Menon) జంటగా అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డెవిల్ (Devil ). పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ గా నవీన్ మేడారం తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 29న తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే చాలామంది హీరోలు వెనకడుగు వేస్తారు. కానీ కొంతమంది మాత్రమే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ తరహా చిత్రాలు చేసేందుకు ముందుకు వస్తారు. అలాంటి వారిలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. అతనొక్కడే, పటాస్ , హరే రామ్, 118, ఓం త్రీడి , ‘బింబిసార’ వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసారు. ఇక ఇప్పుడు మరోసారి పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..బ్రిటిష్ కాలం నాటి సీక్రెట్ ఏజెంట్ డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఓ మర్డర్‌ కేసు నిమిత్తం ఆయన ఛార్జ్ తీసుకుంటాడు. రాజమహల్‌లో ఓ వ్యక్తి హత్య జరుగుతుంది. చేసిందెవరనేది కనిపెట్టాలని బ్రిటీష్‌ దొర కళ్యాణ్ రామ్ ను ఆదేశిస్తారు. దీంతో రాజమహల్‌లో అందరిని ఇన్వెస్టిగేషన్‌ చేయడం మొదలుపెడతాడు. తన తెలివితో అనేక విషయాలు తెలుసుకుంటాడు. అదే క్రమంలో ఆ ఇంట్లోనే ఉంటున్న సంయుక్త మీనన్‌ చూసి ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో ఆయనకు అనేక మిస్టరీ అంశాలు ఎదురవుతుంటాయి. ఇంట్లో అంతా అనుమానంగానే కనిపిస్తుంటారు. అందరూ హంతకులుగానే కనిపిస్తుంటారు.

ఇదే సమయంలో విచిత్రమైన జాతి దాడులు జరుగుతుంటాయి. ఊరిని అల్లకల్లోలం చేస్తుంటారు. ఓ వైపు ఇన్వెస్టిగేషన్‌, ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. అయితే సీక్రెట్‌ ఏజెంట్‌కి, మర్డర్‌ కేసుకి లింకేంటి అని ప్రశ్నించగా, బ్రిటీష్‌ దొర ప్లాన్‌ బి చెబుతాడు. మరి ఆ ప్లాన్‌ బీ ఏంటి..? కళ్యాణ్‌ రామ్‌ పాత్రలోని రహస్యాలేంటి..? ఆయన ప్లానేంటి? అనేది ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేసారు. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Read Also : Hanu-Man: హనుమాన్ ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఇదే